Tecno Pova 6 Neo: స్టైలిష్ డిజైన్‌లో 5G స్మార్ట్‌ఫోన్! బడ్జెట్‌లో "టెక్నో పోవ 6 నియో" మొబైల్.. 10 month ago

featured-image

Tecno అనేది చైనాకు చెందిన ఒక పెద్ద మొబైల్ తయారీ సంస్థ. ఈ కంపెనీ ముఖ్యంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూ భారతదేశంలో మంచి గుర్తింపు పొందింది. టెక్నో లోని Pova సిరీస్..యూత్ ని ఆకర్షించడానికి రూపొందించబడింది. ఈ సిరీస్ ముఖ్యంగా గేమింగ్ వంటి వాటికి అనుకూలమైన ఫీచర్లతో వస్తుంది. ఈ సిరీస్ లో భాగంగా "Tecno Pova 6 Neo" గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ Pova 6 Neo మొబైల్ తక్కువ ధరలో.. 5G కనెక్టివిటీ మరియు విశాలమైన 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఉత్తమమైన కెమెరా.. మంచి పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ గురించిన మరిన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.!


Tecno Pova 6 Neo ఫీచర్లు:

ప్రాసెసర్: MediaTek Dimensity 6300 SoC

డిస్‌ప్లే: 6.67 HD+ IPS LCD స్క్రీన్

రిఫ్రెష్ రేట్: 120Hz

పీక్ బ్రైట్​నెస్: 580 nits

బ్యాటరీ: 5000mAh

ఛార్జింగ్: 18W ఫాస్ట్ ఛార్జింగ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14

బ్యాక్ కెమెరా: 108MP వైడ్ యాంగిల్

ఫ్రంట్ కెమెరా: 8MP


కాన్ఫిగరేషన్:

6GB RAM + 128GB స్టోరేజ్

8GB RAM + 256GB స్టోరేజ్


కనెక్టివిటీ ఫీచర్లు:

  • 5G డ్యూయల్ సిమ్
  • బ్లూటూత్ 5.3
  • USB టైప్-C పోర్ట్
  • Wi-Fi 5
  • NFC


కలర్ ఆప్షన్స్:

  • అజూర్ స్కై
  • అరోరా క్లౌడ్
  • మిడ్నైట్ షాడో


సెన్సార్లు: సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్


ఫోన్ ధర:

6GB RAM, 128GB స్టోరేజ్-- రూ.11,999

8GB RAM, 256GB స్టోరేజ్-- రూ.13,999


ప్లస్ పాయింట్స్:

  • 108MP మెయిన్ కెమెరా
  • IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్
  • స్టీరియో స్పీకర్లు
  • డాల్బీ అట్మోస్


మైనస్ పాయింట్స్:

  • స్లో ఛార్జింగ్
  • స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టం కావచ్చు.
  • సర్వీస్ సెంటర్లు ఎక్కువగా లేవు


Tecno Pova 6 Neo మొబైల్ తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్ తో పాటు..మంచి ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ రోజువారీ పనులకు మరియు సాధారణ గేమింగ్‌కు ఇది బాగా సరిపోతుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ HD+ మాత్రమే కావడం.. అలాగే స్లో ఛార్జింగ్ వంటి లోపాలు ఉన్నాయి. కానీ రూ.15 వేల లోపే ఇన్ని మంచి ఫీచర్లను అందిస్తూ.. ఈ ఫోన్ మంచి పేరును పొందింది. బడ్జెట్‌లో మంచి ఫీచర్లను కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్.. అమెజాన్ ఇండియా వంటి ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.



ఇది చదవండి: బడ్జెట్ ధరలో 7300mAh బ్యాటరీ..90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో "వివో T4 5G".. సేల్స్ ఎప్పుడంటే.?


Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD